Peddha Kapu: ఓటీటీలోకి ‘పెదకాపు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ నటించిన ‘పెదకాపు’ (Peddha Kapu) ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది.

Published : 27 Oct 2023 10:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెదకాపు’ (Peddha Kapu). ఎప్పుడూ కుటుంబ కథలు తీసే ఆయన కొత్తదారిలో ప్రయాణం చేస్తూ తీసిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon prime) వేదికగా శుక్రవారం నుంచి ప్రసారమవుతోంది. విరాట్‌ కర్ణ హీరోగా నటించగా ఆయన సరసన ప్రగతి శ్రీవాస్తవ కనిపించింది. రావు రమేశ్‌, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడ సాగా, రాజీవ్‌ కనకాల, అనసూయ కీలకపాత్రలు పోషించారు.

క‌థేంటంటే: 1982లో రామారావు పార్టీ ప్ర‌క‌టించిన సంద‌ర్భం నాటి క‌థ ఇది. అన్నానికి అల‌వాటు ప‌డిన‌ట్టుగా అధికారానికి అల‌వాటు ప‌డిన ఇద్ద‌రు వ్య‌క్తులు బ‌య‌న్న (న‌రేన్‌) స‌త్య రంగ‌య్య (రావు ర‌మేశ్‌) లంక గ్రామాల్లో  సామాన్యుల జీవితాల‌తో చెల‌గాటమాడుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొత్త పార్టీ రావ‌డంతో ఇరు వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌ల‌వుతుంది. ఆధిప‌త్యం కోసం ర‌క్త‌పాతం సృష్టిస్తారు. సామాన్యులు బ‌ల‌వుతారు. ఆ ప్ర‌భావం స‌త్య రంగ‌య్య ద‌గ్గ‌ర ప‌నిచేసే పెద‌కాపు (విరాట్‌క‌ర్ణ‌) కుటుంబంపైనా ప‌డుతుంది. త‌న అన్న క‌నిపించ‌కుండా మాయ‌మ‌వుతాడు. ఇంత‌కీ పెద‌కాపు అన్న ఏమ‌య్యాడు? ఆత్మ‌గౌర‌వం కోసం పెద‌కాపు ఏం చేశాడు? రామారావు ఎవ‌రికి టికెట్ ఇచ్చారు? 1960ల్లో ఆ ఊళ్ల‌ల్లో ఏం జ‌రిగింది?అక్క‌మ్మ (అన‌సూయ‌) ఎవ‌రు?(Peddha Kapu-1 on OTT) త‌దిత‌ర విష‌యాల్ని అమెజాన్‌ ప్రైమ్‌లో చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని