Pongal Movies: ముందు అజిత్.. బాలయ్య, విజయ్..
అజిత్ హీరోగా తెరకెక్కిన ‘తునివు’ విడుదల తేదీ ఖరారైంది. దాంతో, సంక్రాంతి బరిలో నిలవనున్న చిత్రాలన్నింటి డేట్స్ ఫిక్స్ అయినట్టైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), కోలీవుడ్ హీరోలు విజయ్ (Vijay), అజిత్‌ల (Ajith) చిత్రాలు విడుదలవుతున్నాయనే సంగతి తెలిసిందే. మూడు సినిమాల విడుదల తేదీ ఇప్పటికే ఖరారుకాగా అజిత్ ఫిల్మ్ రిలీజ్ డేట్ బుధవారం ఫిక్స్ అయింది. ముందుగా అజిత్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ హీరో సినిమా ఏ రోజు థియేటర్లలోకి వస్తుందంటే..?
🍿 అజిత్- దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రం ‘తునివు’ (తెలుగులో తెగింపు). ఈ సినిమాని జనవరి 11న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది (Thunivu).
🍿 బాలకృష్ణ హీరోగా దర్శకుడు మలినేని గోపీచంద్ రూపొందించిన సినిమా ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతి హాసన్ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న రాబోతుంది.
🍿 విజయ్- వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వారిసు’ (తెలుగులో వారసుడు). రష్మిక కథానాయిక. ఈ సినిమా జనవరి 12న విడుదలకానుంది (Varisu).
🍿 చిరంజీవి హీరోగా దర్శకుడు కె. బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతి హాసన్ కథానాయిక. ఈ సినిమా జనవరి 13న విడుదలకానుంది.
ఇవీ వస్తున్నాయి..
ఈ అగ్ర హీరోల చిత్రాలతోపాటు రెండు చిన్న సినిమాలు సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ‘విద్య వాసుల అహం’ (vidya vasula aham), సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘కల్యాణం కమనీయం’ (kalyanam kamaneeyam) జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: డబ్బు కోసం పాక్ తిప్పలు.. అమెరికాలో రూజ్వెల్ట్ హోటల్ తనఖా
-
Crime News
Crime News: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
-
General News
TTD Temple: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమిపూజ
-
Movies News
Rana: మళ్లీ అలాంటి స్టార్ హీరోలనే చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు: రానా
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. పిచ్‌పై తగ్గిన పచ్చిక.. వైరల్‌గా మారిన దినేశ్ కార్తిక్ ఫొటోలు!
-
Sports News
wtc final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు రెండు పిచ్‌లు సిద్ధం.. ఎందుకంటే..!