Fighter: ‘ఫైటర్‌’ను మెచ్చిన పీవీ సింధు.. దీపికా పదుకొణె రియాక్షనిదే.. ‘వార్‌ 2’పై హృతిక్‌

హృతిక్‌ రోషన్ తాజా చిత్రం ‘ఫైటర్‌’ (Fighter)పై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసల జల్లు కురిపించారు.

Updated : 30 Jan 2024 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ చిత్రం ‘ఫైటర్‌’ (Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) రివ్యూ ఇవ్వగా ఆ పోస్ట్‌కు దీపికా పదుకొణె స్పందించారు. ‘సినిమా చాలా బాగుంది. హృతిక్‌, దీపికా నటన అద్భుతంగా ఉంది. అనిల్‌ కపూర్‌ ఆకట్టుకున్నారు’ అని సింధు ప్రశంసించారు. దీపిక స్పందిస్తూ ‘లవ్ యూ’ అని కామెంట్‌ పెట్టారు.

17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్‌, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్‌ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!

ఈ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేసిన హృతిక్ రోషన్‌ దానికోసం తానెంతో కష్టపడినట్లు చెప్పారు. ‘ఈ చిత్రంలో నా లుక్‌ కోసం కఠోరంగా శ్రమించా. సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నా. ఏడాదిపాటు స్నేహితులను కూడా కలవలేదు. త్వరగా నిద్రపోయేవాడిని. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవాడిని’ అని చెప్పారు. త్వరలోనే ‘వార్‌ 2’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. ‘వార్‌’తో పోలిస్తే ఈ సీక్వెల్‌ కొత్త బెంచ్‌ మార్క్‌ను సృష్టిస్తుందన్నారు. అయాన్‌ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని హృతిక్‌ పేర్కొన్నారు. ఈ కాంబినేషన్‌పై సినీ ప్రియుల్లో ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ‘దేవర’ (Devara)లో నటిస్తున్నారు ఎన్టీఆర్‌. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి భాగం ఏప్రిల్‌ 5న విడుదలవుతుంది. ఈ యాక్షన్‌ చిత్రంతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని