Telugu Movies: చిరంజీవి ‘భోళా శంకర్‌’ను బీట్‌ చేసిన రజనీ ‘జైలర్‌’.. వసూళ్లు ఎంతంటే?

Telugu Movies: గత వారం వచ్చిన చిరంజీవి ‘భోళా శంకర్‌’, రజనీ ‘జైలర్‌’ వసూళ్లను ట్రేడ్‌ వర్గాలు అంచనా వేయగా, రజనీ మూవీ ముందంజలో ఉంది.

Updated : 14 Aug 2023 17:41 IST

హైదరాబాద్‌: గతవారం బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికర పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi), రజనీకాంత్‌ (Rajinikanth) తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీ నటించిన ‘జైలర్‌’ ఆగస్టు 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. నెల్సన్‌ టేకింగ్, రజనీ స్టైల్‌, మాస్‌ యాక్షన్‌ అభిమానులనే కాదు, సినీ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఆగస్టు 11న చిరంజీవి-మెహర్‌ రమేశ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భోళా శంకర్‌’ విడుదలైంది. చిరంజీవి నటన, అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో మెరుపులు తప్ప సినిమా ఏమాత్రం మెప్పించలేకపోయింది. అభిమానులు సైతం ఈ సినిమా ఫలితంపై నిరాశ పడుతున్నారు.

ఈ క్రమంలో రెండు సినిమాల ట్రేడ్‌ లెక్కలు చూస్తే ‘జైలర్‌’ (Jailer) చాలా ముందున్నాడు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.32 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ.300కోట్లు (గ్రాస్‌) మార్కునకు చేరువగా ఉంది. మరోవైపు చిరంజీవి ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar) నాలుగు రోజులకు రూ.25.22 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు సమాచారం. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిరు మూవీ కలెక్షన్ల విషయంలో వెనకబడిపోయింది. ఈ అవకాశాన్ని ‘జైలర్‌’ ఒడిసిపడుతోంది. ఇప్పటికే పలు థియేటర్‌లలో షోల సంఖ్యను పెంచారు. మరోవైపు ఈ వారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ‘జైలర్‌’ హవా కొనసాగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని