Ram charan: రామ్‌చరణ్‌-ఉపాసనలకు పాప.. మెగా అభిమానుల మీమ్స్‌ సంబరాలివే!

ram charan baby: రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెబుతూ మెగా అభిమానులు ట్విటర్‌ వేదికగా సరదా మీమ్స్‌ను పంచుకున్నారు.

Updated : 20 Jun 2023 16:01 IST

హైదరాబాద్‌: మెగా అభిమానులు (Mega Fans) ఆనందంలో మునిగి తేలుతున్నారు. రామ్‌చరణ్‌-ఉపాసన(Ram charan-Upasana) దంపతులు మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు (ram charan baby) జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ‘మెగా ప్రిన్సెస్‌’ వచ్చేసిందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వరుస ట్వీట్లు పోస్టు చేస్తున్నారు. రామ్‌చరణ్‌ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి(Chiranjeevi)ని కోట్‌ చేస్తూ ‘బాసు పార్టీ లేదా’ అని కొందరు ట్వీట్‌ చేశారు. అలాగే చిరంజీవి, నాగబాబు, పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) సంబరాలు చేసుకుంటున్నట్లు క్రియేట్‌ చేసిన వీడియో నవ్వులు పంచుతోంది. ఇక ‘ది లయన్‌ కింగ్‌’లోని సీన్‌ను బేబీ పరిచయ సన్నివేశాలంటూ పోస్ట్‌ చేశారు. అల్లు అర్జున్‌ (Allu arjun)తనయుడిని అయాన్‌(allu ayaan)ను కోట్‌ చేస్తూ మరికొందరు ‘ఖుషి’ సీన్‌ను రీక్రియేట్‌ చేశారు. ఆద్యంతం అలరిస్తున్న మీమ్స్‌ను మీరూ చూసేయండి












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని