Ram Charan: ఆమె కనిపిస్తే కళ్లార్పకుండా చూస్తుంటా.. తన మొదటి క్రష్‌ గురించి చెప్పిన చరణ్‌

రామ్‌ చరణ్‌ (Ram Charan) తన మొదటి క్రష్‌ గురించి చెప్పారు. ఆ హీరోయిన్‌ ఎక్కడ కనిపించినా కళ్లు ఆర్పకుండా చూస్తానని అన్నారు. 

Updated : 15 Feb 2023 19:26 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే హీరోల్లో రామ్‌ చరణ్‌ (Ram Charan) ముందుంటాడు. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌కు షేర్‌ చేస్తుంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు.


Julia Roberts

ఈ ఇంటర్వ్యూలో చరణ్‌ తన మొదటి క్రష్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు జూలియా రాబర్ట్స్‌ (Julia Roberts) అంటే చాలా ఇష్టం. ఆమెను టీవీలో చూసినా, బిగ్‌ స్క్రీన్‌పై చూసినా అలా కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతాను. ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ‘ప్రెట్టీ ఉమెన్‌’ (Pretty Woman) సినిమా నుంచి నేను ఆమెకు పెద్ద అభిమానిని అయ్యాను. అలాగే కేథరిన్‌ జెటా జోన్స్‌ (Catherine Zeta-Jones) కూడా ఇష్టం. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది ‘మార్క్‌ ఆఫ్‌ జోరో’ (Mark of Zorro). ఆ సినిమాలో తన నటన చూసి చాలా ఎంజాయ్‌ చేశాను’’ అన్నారు.

ఇక ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు (BuchiBabu)తో రామ్‌ చరణ్‌ సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ పుట్టినరోజు సందర్భంగా చరణ్‌ ఆయన్ని కలిసి విషెస్‌ చెప్పాడు. ఆ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ..‘‘నా అభిమాన దర్శకుల్లో ఒకరైన బుచ్చిబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలోనే సెట్‌లో మళ్లీ కలుద్దాం’’ అని రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని