తమిళ దర్శకుడితో రామ్‌ కొత్త ప్రాజెక్ట్‌  

‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రెడ్‌’ చిత్రాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు కథానాయకుడు రామ్‌పోతినేని. ఇటీవల విడుదలైన ‘రెడ్‌’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్‌ త్వరలో తమిళ దర్శకుడితో కలిసి కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు....

Published : 18 Feb 2021 16:56 IST

హైదరాబాద్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రెడ్‌’ చిత్రాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు కథానాయకుడు రామ్‌పోతినేని. ఇటీవల విడుదలైన ‘రెడ్‌’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్‌ త్వరలో తమిళ దర్శకుడితో కలిసి కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఆనందం’, ‘పందెంకోడి’, ‘పందెంకోడి-2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగుస్వామి.. డైరెక్ట్‌ తెలుగు సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రామ్‌ కథానాయకుడిగా ఆయన ఓ విభిన్నకథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ చిత్తూరి నిర్మాత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని