Ravi Teja: ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌.. రవితేజ ఏమన్నారంటే!

రవితేజ నటించిన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao). ఈ సినిమా ప్రచారంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 14 Oct 2023 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao)తో పలకరించనున్నారు హీరో రవితేజ (Ravi Teja). అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల దగ్గరపడడంతో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

గతేడాది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’తో అలరించిన రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ తర్వాత మళ్లీ అలాంటి సినిమానే తీయనున్నట్లు తెలిపారు. ‘వచ్చే ఏడాది మరో కామెడీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నా. అందులో బ్రహ్మానందం కూడా ఉంటారు. అలాగే త్వరలోనే ఓ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కూడా చేయనున్నా. ఇక ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌ గురించి రాజమౌళితో ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలో ‘విక్రమార్కుడు-2’ (Vikramarkudu 2) రానుందని కొన్ని వార్తలు వచ్చాయి. రాజమౌళితో కలిసి వర్క్‌ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. అసలు.. ఆయనతో కలిసి పనిచేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఎవరికి మాత్రం ఉండదు?’ అని అన్నారు. యాక్షన్‌, డ్రామా, ఎమోషన్‌.. ఇలా ఏ రకమైన సినిమాలో నటించినా తన లక్ష్యం మాత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమేనని రవితేజ చెప్పారు. భవిష్యత్తులో తన బయోపిక్ తెరకెక్కితే దానికి ‘మాస్‌ మహారాజా’ అనే టైటిల్‌ను పెడతానని అన్నారు. 

హీరో ఒడిలో కూర్చోమన్నారు.. ఇబ్బందిపడ్డా: సుహాసిని

ఇక ‘కిక్‌’ సినిమాలో దొంగగా కనిపించి కామెడీ పండించిన రవితేజ.. ఇప్పుడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో గజదొంగ పాత్రలో మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ కథానాయికలు. అలాగే, నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని