‘ఖిలాడి’ గేమ్‌లోకి మలయాళీ హీరో!

మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా ‘ఖిలాడి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని ఒక ప్రధాన పాత్రలో మాలీవుడ్‌ యువ నటుడు ఉన్నిముకుందన్‌ నటించనున్నారు. ఈ మేరకు చిత్ర

Updated : 01 Feb 2021 16:58 IST

హైదరాబాద్‌: రవితేజ హీరోగా ‘ఖిలాడి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక ప్రధాన పాత్రలో మాలీవుడ్‌ యువ నటుడు ఉన్ని ముకుందన్‌ కనిపించనున్నారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు రమేష్‌వర్మ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఉన్ని ముకుందన్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎన్టీఆర్‌ నటించిన ‘జనతా గ్యారేజ్‌’తో పాటు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’లో కీలకపాత్ర పోషించాడు. రవితేజ ఇందులో ద్విపాత్రిభినయం చేస్తున్నారు. మరోవైపు యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కూడా ఈ చిత్రంలో భాగమైన సంగతి తెలిసిందే. రమేష్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇవీ చదవండి!

సోనూ షో ఆఫ్‌.. నాగబాబు గీసిన బొమ్మ

‘ఉనికి’ పోస్టర్‌ విడుదల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని