RGV: వాళ్లని చూసి భయంతో చలిజ్వరం వచ్చేసింది: రాంగోపాల్‌ వర్మ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాలు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు....

Published : 04 Feb 2022 11:35 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాలు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. నగరంలోని బీఆర్టీఎస్‌ రోడ్డుపై జరిగిన ఈ నిరసనలో వేలాది మంది ఉద్యోగులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఉద్యోగుల నిరసనకు సంబంధించిన ఫొటోని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన వర్మ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ సంగతేమో కానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లెక్కి నిరసన చేయడం చూసి షాకయ్యా. ప్రపంచంలో ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా అని సందేహం వచ్చింది’’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని