MAA Election: ప్రకాశ్‌రాజ్‌పై ఆర్జీవీ వరుస ట్వీట్లు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎలక్షన్ ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అధ్యక్షుడి పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాశ్‌రాజ్‌పై పలువురు ఇండస్ట్రీ సభ్యులు విమర్శల వర్షం ఎక్కుపెట్టారు.....
రామారావు టు రజనీకాంత్.. వీళ్లంతా లోకలా?
విమర్శకులకు కౌంటర్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల అంశం ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాశ్‌రాజ్‌పై పలువురు ఇండస్ట్రీ సభ్యులు విమర్శల వర్షం ఎక్కుపెట్టారు. ఆయన నాన్‌లోకల్ అని.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ పలువురు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విమర్శకులకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కౌంటర్ విసిరారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్‌లోకల్ అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్లిన రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ.. ఎలా లోకల్ అవుతారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
‘కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్‌లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు, నాగేశ్వరరావు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ, తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన్‌బాబు లోకలా? మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజనీకాంత్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్లిన అమితాబ్ బచ్చన్ లోకలా? ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని ముద్రించి, భార్యాపిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడున్న ఎంతోమంది మహిళలకు పని కల్పిస్తున్న ఆయన నాన్ లోకలా? ప్రకాశ్‌రాజ్‌లోని ప్రతిభ గుర్తించిన ఈ దేశం నాలుగుసార్లు ఆయన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే.. ఇప్పుడు అదే వ్యక్తిని నాన్‌లోకల్ అంటున్నాం’ అని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.
ఈసారి ‘మా’ ఎన్నికల్లో ఏకంగా నలుగురు సభ్యులు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమ.. బరిలో ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం నటుడు ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లోకల్, నాన్‌లోకల్ అంటూ తనపై వస్తోన్న విమర్శల గురించి స్పందించారు. కళాకారులు యూనివర్సల్ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా..
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్యాయత్నం..
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్‌లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!