RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. బీజీఎం వింటారా!

కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతం ఆయువు పట్టుగా నిలుస్తుంది. అలాంటి సినిమాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ ప్రాజెక్టుకు ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతం, నేపథ్యం సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

Published : 05 May 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతం ఆయువు పట్టుగా నిలుస్తుంది. అలాంటి సినిమాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ ప్రాజెక్టుకు ఎం. ఎం. కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సన్నివేశానికి తగ్గ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చి సినిమాను రక్తి కట్టించారాయన. ‘ఈ సూపర్‌హిట్‌ చిత్రంలోని పాటలనైతే మళ్లీ మళ్లీ వినగలంగానీ బీజీఎం (బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌) ఎలా?’ అనుకునే వారికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ అందించింది. కొన్ని సీన్లకు సంబంధించిన నేపథ్య సంగీతాన్ని తాజాగా విడుదల చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఆలస్యమెందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టండి...












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని