RRR: బ్రిటిష్‌ కోటలోకి ఎన్టీఆర్‌ ఎంట్రీ.. టైగర్‌ ఫైట్‌సీన్‌ అదుర్స్‌

ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా, తమ అభిమాన కథానాయకుడు ఆకాశమంత ఎత్తులో కనిపించేలా ప్రేక్షకులకు చూపించటం అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli)

Published : 14 Jun 2022 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా, తమ అభిమాన కథానాయకుడు ఆకాశమంత ఎత్తులో కనిపించేలా ప్రేక్షకులకు చూపించటం అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli) స్టైల్‌. ఇక ఆయన సినిమాల్లో విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తాయి. ఇటీవల విడుదలైన ‘RRR’లో అయితే, సినిమా చూస్తున్న ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపు అయింది. ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా తెరకెక్కిన ఈ చిత్ర ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీ5, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో విరామానికి ముందు జంతువులతో కలిసి ఎన్టీఆర్‌ బ్రిటిష్‌ కోటపై చేసే దాడి సన్నివేశాన్ని నెట్‌ప్లిక్స్‌ పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా అలరిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని