SAINDHAV: ‘సైంధవ్‌’ కీలక షెడ్యూల్‌.. సెట్‌లో శైలేష్‌ కొలను డ్యాన్స్‌

‘సైంధవ్‌’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు శైలేష్‌ కొలను. ఈ సినిమా షూట్‌ అప్‌డేట్‌ను తెలియజేస్తూ ఓ ట్వీట్‌ చేశారు.

Published : 13 Aug 2023 13:48 IST

హైదరాబాద్‌: వెంకటేశ్‌ (Venkatesh) నటిస్తోన్న యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సైంధవ్‌’ (Saindhav). శైలేష్‌ కొలను దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. దాదాపు 16 రోజులపాటు షూట్‌ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ట్వీట్‌ చేశారు.

‘‘క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో దాదాపు 16 రోజులుపాటు శ్రమించి షెడ్యూల్‌ పూర్తి చేశాం. రామ్‌-లక్ష్మణ్‌ సారథ్యంలో ఎనిమిది మంది నటీనటులపై హై ఓల్టేజ్‌ క్లైమాక్స్‌ షాట్స్‌ను చిత్రీకరించాం’’ అని ఆయన పేర్కొన్నారు. షూట్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చూపిస్తూ ఓ వీడియో షేర్‌ చేశారు. రామ్‌-లక్ష్మణ్‌, ఇతర బృందానికి థ్యాంక్స్‌ చెప్పారు. ఫైట్‌ మాస్టర్స్‌తో కలిసి డ్యాన్స్‌ చేశారు.

‘ఓరి దేవుడా’, ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ తర్వాత వెంకటేశ్‌ నటిస్తోన్న చిత్రమిదే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఇందులో ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని