Kangana Ranaut: నేను ఇక్కడ ఒంటరిదాన్ని కాదు : కంగనా

ఇకపై బాలీవుడ్‌లో తనకెవ్వరూ లేరని కంగనా చెప్పదట. ఎందుకంటే ఆమెకు బాలీవుడ్ బడా హీరో మద్దతుగా నిలిచారు. అతను మరెవరో కాదు సల్మాన్‌ఖాన్‌. 

Published : 14 May 2022 02:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇకపై బాలీవుడ్‌లో తనకెవ్వరూ లేరని కంగనా చెప్పదట. ఎందుకంటే ఆమెకు బాలీవుడ్ బడా హీరో మద్దతుగా నిలిచారు. అతను మరెవరో కాదు సల్మాన్‌ఖాన్‌. ఇటీవల సల్మాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ ఇంట్లో ఇచ్చిన ఈద్‌ పార్టీకి కంగనా హాజరైంది. దీంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏకంగా కంగనా నటించిన ‘ధాకడ్‌’ చిత్రానికి సల్మాన్‌ బహిరంగంగా మద్దతు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా కంగనా నటించిన చిత్రానికి సపోర్ట్‌ ఇచ్చారు. చిత్రబృందానికి అల్‌ ది బెస్ట్‌ చెప్పారు. దీనిపై కంగనా స్పందిస్తూ సల్మాన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ స్కీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకుంది. ‘నా దబాంగ్‌ హీరోకు ధన్యవాదాలు. నేను ఈ సినీ పరిశ్రమలో ఒంటరిగా ఉన్నానని ఎప్పటికీ చెప్పను. మెత్తం ధాకడ్‌ టీమ్‌ తరఫున మీకు ధన్యవాదాలు’’ అని పేర్కొంది. కాగా, కొన్ని రోజులు క్రితం సల్మాన్‌ ఇంటికి ఈద్‌ పార్టీకి హాజరైన కంగనా బాలీవుడ్‌ నటులు తన పై ఆభద్రతాభావంతో ఉన్నారని, అంతా వ్యక్తిగతంగా ప్రశంసిస్తారు కానీ బహిరంగంగా ప్రశంసించడానికి ఇష్టపడడం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు