Salman Khan: దయచేసి ఆ మెయిల్స్‌ నమ్మొద్దు: సల్మాన్‌ఖాన్‌

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) తాజాగా ఓ పోస్ట్‌ చేశారు. ఆయన పేరుతో వస్తోన్న సందేశాలు నమ్మొద్దని చెప్పారు.

Updated : 17 Jul 2023 15:06 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ విషయంలో తన పేరుతో వచ్చే మెయిల్స్‌ను నమ్మొద్దని ఆయన సూచించారు. తన పేరును వినియోగించి ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంతకీ ఆయన ఆ పోస్ట్‌ ఎందుకు పెట్టారంటే..

సల్మాన్‌ఖాన్‌కు సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే. ఆ సంస్థ పేరుతో ఇటీవల కాలంలో ఓ ఫేక్‌ మెయిల్‌ చక్కర్లు కొట్టింది. సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ తెరకెక్కించనున్న ఓ సినిమాలో నటీనటులను ఎంపిక చేస్తున్నామని.. ఆసక్తి ఉంటే సంప్రదించమని ఆ మెయిల్‌లోని సారాంశం. ఈ విషయం కాస్త సల్మాన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తాజాగా ఓ నోట్‌ రిలీజ్‌ చేశారు.

ప్రియదర్శితో నన్ను పోల్చొద్దు: రాహుల్‌ రామకృష్ణ

‘‘సల్మాన్‌ఖాన్‌ లేదా ఆయనకు చెందిన సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ ప్రస్తుతానికి కొత్త నటీనటులను తీసుకోవడం లేదు. మేము నిర్మించనున్న భవిష్యత్‌ చిత్రాల కోసం క్యాస్టింగ్‌ ఏజెంట్స్‌ను నియమించలేదు. మా సంస్థ రూపొందించనున్న సినిమాల కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నామంటూ మీకు  ఏమైనా సందేశాలు వస్తే దయచేసి వాటిని నమ్మకండి. సల్మాన్‌ పేరుని తప్పుగా వాడుతున్నట్లు ఎవరినైనా గుర్తిస్తే తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన టీమ్‌ పేర్కొంది. ఇక, సల్మాన్‌ సినిమాల విషయానికి వస్తే ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ తర్వాత ఆయన నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు