Samantha: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సమంత క్షమాపణ
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నటి సమంత (Samantha) జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. గతేడాది మొదలైన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులకు సమంత (Samantha) క్షమాపణలు చెప్పారు. విజయ్‌తో కలిసి నటిస్తోన్న ‘ఖుషి’ (Kushi) షూట్‌లో తాను అతి త్వరలోనే పాల్గొంటానని ట్వీట్ చేశారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ను ఆమె ట్యాగ్ చేశారు. అసలేం జరిగిందంటే..
విజయ్ దేవరకొండ - సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ గతేడాది పట్టాలెక్కింది. ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రంగా ఇది మొదలైంది. కశ్మీర్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. గతేడాది షూట్‌ను మొదలుపెట్టారు. కశ్మీర్ పరిసర ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌లోనూ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలోనే సమంత మయోసైటిస్ బారిన పడటంతో ఆమె కొన్ని నెలలపాటు షూట్‌కు దూరంగా ఉన్నారు. దీంతో సినిమా వాయిదా పడింది.
కాగా, మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఇటీవల ‘సిటాడెల్’ (Citadel) కోసం రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని ఆమె తాజాగా ట్విటర్‌లో షేర్ చేయగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘మేడమ్.. ‘ఖుషి’ సంగతి ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు. దానిపై స్పందించిన సామ్.. రౌడీ బాయ్ అభిమానులకు సారీ చెప్పి.. అతి త్వరలో సెట్‌లోకి అడుగుపెడతానని గుడ్‌న్యూస్ చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
-
Politics News
Ganta Srinivasa Rao: ఫైనల్స్‌లో వైకాపా ఉండదు