Sammathame: జూన్‌ 24న ప్రేమకథకు ‘సమ్మతమే’...

 ‘ఎస్‌ఆర్‌కళ్యాణమండపం’,‘సెబాస్టియన్‌ పీసీ’ వంటి సినిమాలతో అలరించిన యువ నటుడు కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సమ్మతమే’. 

Published : 28 Apr 2022 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’,‘సెబాస్టియన్‌ పీసీ’ వంటి సినిమాలతో అలరించిన యువ నటుడు కిరణ్‌ అబ్బవరం. అతడు తాజాగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సమ్మతమే’. అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో కిరణ్‌ సరసన చాందినీ చౌదరి నటిస్తోంది. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు హీరో కిరణ్‌ ట్వీట్‌ చేశాడు. ‘కృష్ణ, శాన్విల ప్రేమ కథ మీ అందరి ప్రేమ కథకు దగ్గరగా ఉంటుంది. జూన్‌24 నుంచి మిమ్మల్ని అలరించనుంది’ అని పోస్టు చేశారు. కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ప్రచార గీతాలు విడుదలైన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని