Satyadev: ‘తిమ్మరుసు’ విడుదల ఖరారు

కొవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు..

Published : 08 Jul 2021 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా ‘తిమ్మరుసు’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సత్యదేవ్‌ కథానాయకుడిగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రియాంక జవాల్కర్‌ నాయిక. ‘ఇంతకాలం మిమ్మల్ని మిస్‌ అయ్యాం. మళ్లీ కలుసుకోబోతున్నాం. థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. మీ అందరినీ ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు సత్యదేవ్‌. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌. కోనేరు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని