Satyam Rajesh: అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు

‘పొలిమేర’ సిరీస్‌ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్‌. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్‌’. వై.యుగంధర్‌ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించారు.

Updated : 18 Apr 2024 16:09 IST

‘పొలిమేర’ సిరీస్‌ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్‌. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్‌’. వై.యుగంధర్‌ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించారు. మేఘా చౌదరి కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సత్యం రాజేశ్‌.

‘‘ఇది మన ఎదురింట్లోనో.. పక్కింట్లోనో జరిగే కథే. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యల్ని చూపిస్తుంది. ఇది పూర్తిగా ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే కథగా సాగుతుంది. దర్శకుడు కథ ఎంత బాగా చెప్పారో.. అంత కంటే చక్కగా తెరకెక్కించారు. దీంట్లో చాలా కోణాలు కనిపిస్తాయి. ఈ సినిమాలో మేడ మీద నుంచి పడి చనిపోయే సీన్‌ ఒకటుంది. దాన్ని వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశాం. అందుకే దీనికి ‘ఎ’ సర్టిఫికెట్‌ వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది’’.

  • ‘‘ఈ చిత్రాన్ని మేము ఓటీటీ కోసమే ఓ చిన్న సినిమాలా రూపొందించాలనుకున్నాం. కానీ, వచ్చిన అవుట్‌పుట్‌ మేము అనుకున్న దానికన్నా బాగా రావడంతో థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నాం. ఇందులో నా పాత్రకు పెద్దగా సంభాషణలు ఉండవు. నా పాత్ర చూసి ప్రేక్షకులు సింపతీతో బయటకొస్తారు. ఈ సినిమాకి సాహిత్య సాగర్‌ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే దీంట్లోని మర్డర్‌ మిస్టరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’.
  • ‘‘మనం కుమ్మేస్తాం.. కొట్టేస్తాం’ అని మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. నాకు బాగా నప్పే సినిమాలనే నేను చేస్తా. మంచి కథా బలమున్న చిత్రాలొస్తే హీరోగా చేస్తా. ప్రస్తుతం నేను ప్రధాన పాత్రలో ‘స్ట్రీట్‌ ఫైట్‌’ అనే సినిమా చేస్తున్నా. అలాగే ‘మిస్టర్‌ బచ్చన్‌’లో రవితేజకు మిత్రుడిగా నటిస్తున్నా. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని