Shaakuntalam OTT: ప్రచారం లేకుండానే ఓటీటీలోకి ‘శాకుంతలం’

సమంత (Samantha), దేవ్‌ మోహన్‌ (Dev Mohan) ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణ శేఖర్‌ దర్శకుడు. అల్లుఅర్హ ఈ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.   

Published : 11 May 2023 12:52 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంత (Samantha) నటించిన సరికొత్త చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). కాళిదాసు రచించిన దృశ్యకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ను ఆధారంగా చేసుకుని గుణశేఖర్‌ దీన్ని రూపొందించారు. భారీ అంచనాల మధ్య గత నెలలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా ఈ సినిమా ఎలాంటి ప్రచారం లేకుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా గురువారం (ఈరోజు) నుంచి ఇది ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ గుణ టీమ్‌ వర్క్స్‌ తాజాగా ఓ ట్వీట్‌ పెట్టింది.

అదే విధంగా ఇప్పటి వరకు ‘శాకుంతలం’ సినిమా ఆరు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ‘న్యూ యార్క్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’లో ‘బెస్ట్‌ ఫాంటసీ ఫిల్మ్‌’, ‘బెస్ట్‌ మ్యూజికల్‌ ఫిల్మ్‌’గా; ‘అమెరికన్‌ గోల్డెన్‌ పిక్చర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ‘బెస్ట్‌ ఉమెన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’, ‘బెస్ట్‌ సినిమాటోగ్రఫీ ఫీచర్‌ ఫిల్మ్‌’, ‘బెస్ట్‌ ఫీచర్‌ నెరేటివ్‌ లాంగ్‌’గా; ‘ఇండో ఫ్రెంచ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ‘బెస్ట్‌ డైరెక్టర్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’, ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’గా ఈ సినిమా అవార్డులు అందుకున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అలాగే, ‘కేన్స్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ‘అమెరికన్‌ గోల్డెన్‌ పిక్చర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు ఇది అధికారికంగా ఎంపికైనట్లు గుణ టీమ్‌ వర్క్స్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని