Shakuntala poster: సమంత బర్త్‌డే సర్‌ప్రైజ్‌ పోస్టర్‌ చూశారా..!

మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’.

Published : 28 Apr 2022 10:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కీలకపాత్ర పోషిస్తోంది. సమంత పుట్టిన రోజు సందర్భంగా గుణశేఖర్‌ ఈ సినిమాలోని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మా అందాల శకుంతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్విట్‌ చేశారు.

ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉన్న సమంత లుక్‌ చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ, కన్నడ,మలయాళీ,హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో సమంతతో పాటు దేవ్‌ మోహన్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని