Sharwanand: శర్వానంద్‌ కొత్త సినిమాల అప్‌డేట్స్‌ ఇవే..

శర్వానంద్‌ కొత్త సినిమా అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Published : 06 Mar 2024 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో శర్వానంద్ (Sharwanand) పుట్టినరోజు సందర్భంగా అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ పంచుకుంటున్నారు మేకర్స్‌.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. దీనికి ‘మనమే’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను టీమ్‌ విడుదల చేసింది. ఈ చిత్రంలో చిన్నారి నేపథ్యంలో సాగే సన్నివేశాలు హైలైట్‌ కానున్నట్లు సమాచారం. దీని షూటింగ్‌ లండన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లోనూ బాబుతో శర్వానంద్‌ నిల్చున్నట్లు చూపించారు. ఆ బాబు శ్రీరామ్ ఆదిత్య కుమారుడని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించనుంది.

ఈ హీరో 36వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కూడా వచ్చేసింది. #Sharwa36 పేరుతో ఇది ప్రచారంలో ఉంది. దీని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను పంచుకున్న శర్వానంద్‌ ‘సాహసం చేసేందుకు సిద్ధంగా ఉండండి’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీనికి అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రానుంది. రేసింగ్‌ ఆధారంగా రూపొందించనున్న ఈ సినిమాలో శర్వా బైక్‌ రైడర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఈ బ్యానర్‌పై ‘రన్‌ రాజా రన్’, ‘ఎక్స్‌ ప్రెస్‌రాజా’ , ‘మహానుభావుడు’ వంటి హిట్‌ సినిమాల్లో నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని