Shilpa Shetty: డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నట్లు భావించారు: శిల్పాశెట్టి

తాను డబ్బు కోసం రాజ్‌ కుంద్రాను వివాహం చేసుకోలేదని శిల్పా శెట్టి స్పష్టం చేశారు.

Published : 09 Mar 2024 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ కపుల్‌ శిల్పా శెట్టి-రాజ్‌ కుంద్రా(Raj Kundra) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల వీరిపై విడాకుల రూమర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్పా శెట్టి (Shilpa Shetty).. తాను డబ్బు కోసమే రాజ్‌ కుంద్రాను పెళ్లి చేసుకున్నట్లు గతంలోనూ చాలామంది భావించారని చెప్పారు.

‘‘నా భర్త ధనవంతుడని అందరికీ తెలిసిన విషయమే. అయితే, చాలామంది పెళ్లికి ముందు నా ఆర్థిక స్థితిని ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. వివాహం కంటే ముందు నా ఆర్థికస్థితిని గూగుల్‌ చేయడం అందరూ మర్చిపోతున్నారనుకుంటా. నేను అతడి డబ్బును చూసి ఇష్టపడలేదు. రాజ్‌ తన చుట్టూ ఉండేవారిపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. స్నేహితుల ద్వారా ఏర్పడిన మా పరిచయం ప్రేమగా మారింది. తన స్నేహితులే నాకూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు. అలా మా బంధం ప్రారంభమైంది. మేము కలిసి జీవించాలని దేవుడు నిర్ణయించాడు’’ అని చెప్పారు.

ఇక గతంలో రాజ్‌కుంద్రా తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ‘‘మేము విడిపోతున్నాం. దయచేసి ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్‌గా నిలవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా’’ అని పోస్ట్‌ చేశారు. దీనికి హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జోడించారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటుందని మీడియా ప్రచారం చేసింది. అయితే, కొన్ని సంవత్సరాలుగా తాను ధరించిన మాస్క్‌కు గుడ్‌బై చెప్పే క్రమంలో ఆయన ఈ పోస్ట్‌ చేశారు. దీంతో ఆ రూమర్స్‌కు చెక్‌ పడింది. ‘యూటీ 69’ (UT 69)తో రాజ్‌కుంద్రా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం గతేడాది విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని