Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్‌ హీరో..

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa)లో మరో స్టార్‌ హీరో భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

Updated : 12 Oct 2023 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా రూపొందుతోన్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). ఇప్పటికే ఇందులోని తారాగణాన్ని ప్రకటించి అంచనాలు పెంచేసిన చిత్రబృందం తాజాగా మరో విషయాన్ని పంచుకుంది. ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ భాగం కానున్నారని తెలుపుతూ పోస్ట్‌ పెట్టింది. దీంతో ఈ సినిమాపై కన్నడ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

విష్ణు ప్రధానపాత్రలో నటిస్తోన్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మంచు విష్ణు కూడా పరోక్షంగా ఖరారు చేశారు. ఇప్పటికే ఇందులో మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ ఇందులో భాగమయ్యారు. తాజాగా కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) ఈ సినిమాలో నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఆయన ఈ సినిమాలో భాగం కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ‘ఆయనే సర్వం..ఆయనే విశ్వం’ అంటూ హర హర మహాదేవ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది. అయితే, ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారని మాత్రం ప్రకటించలేదు. ఇక 1988లో శివరాజ్‌కుమార్‌ హీరోగా కన్నడలో ‘భక్త కన్నప్ప’ సినిమా తెరకెక్కి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలోని పోస్టర్‌కు సంబంధించిన ఓ ట్వీట్‌ను మంచు విష్ణు ఈ సందర్భంగా షేర్‌ చేశారు. 

వినూత్నంగా ‘టైగర్3’ ప్రమోషన్స్‌.. వన్డే వరల్డ్‌ కప్‌లోనూ ప్రచారం..

ఇక ‘కన్నప్ప’ చిత్రం మొత్తాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే దీనికోసం తయారు చేయించిన ఆర్ట్‌ వర్క్‌ మొత్తాన్ని అక్కడకు తరలించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే దీని షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మొదట నుపుర్‌ సనన్‌ను ఎంపిక చేశారు. డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని