Tiger 3: వినూత్నంగా ‘టైగర్3’ ప్రమోషన్స్‌.. వన్డే వరల్డ్‌ కప్‌లోనూ ప్రచారం..

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) హీరోగా మనీష్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టైగర్‌3’ (Tiger 3). ఈ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్నంగా చేపట్టనున్నారు.

Updated : 12 Oct 2023 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సల్మాన్‌ ఖాన్‌ హీరోగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన చిత్రం ‘టైగర్‌3’ (Tiger 3). ఈ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్న రీతిలో చేపట్టనున్నారు. ఎంతో ఉత్కంఠ రేపే భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఈ చిత్రాన్ని ప్రచారం చేయనున్నారు. దీని కోసం వరల్డ్‌ కప్‌ బ్రాడ్‌ కాస్ట్‌ నెట్‌ వర్క్‌ అయిన స్టార్‌ స్పోర్ట్స్‌తో ఈ చిత్ర నిర్మాణ సంస్థ చేతులు కలిపింది. దీంతో వరల్డ్‌ కప్ అంతా ‘టైగర్‌3’ ప్రమోషన్స్‌తో నిండిపోనుంది.

ఇక ఈ ప్రచారం కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కో బ్రాండింగ్‌ ప్రోమోస్‌లో నటించారు. వీటిని వన్డే క్రికెట్‌ వరల్డ్ కప్‌లో (Cricket World Cup) జరిగే కీలక మ్యాచ్‌లన్నింటిలో ప్రదర్శించనున్నారు. 2019లో జరిగిన ప్రపంచకప్‌ను 500 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ముఖ్యంగా ఇండియా-పాకిస్థాన్‌ ఆటను 200మిలియన్ల మందికి పైగా చూశారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ‘టైగర్‌3’ను ప్రచారం చేయడం మాస్టార్‌ ప్లాన్‌ అంటూ ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

శ్రీలీల పక్కా ప్లానర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాజల్‌ అగర్వాల్‌

ఇక ‘టైగర్‌3’ విషయానికొస్తే.. మనీష్‌ శర్మ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌, క్రేజీ కథానాయిక కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్నారు. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా రానున్న దీన్ని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఐదవ సినిమాగా ఆదిత్య చోప్రా నిర్మిసున్నారు. ఇందులో షారుక్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటించారు. సల్మాన్‌-షారుక్‌ల మధ్య భారీ పోరాట ఘట్టాల్ని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని