Fighter: ‘ఫైటర్‌’ ముద్దుసీన్‌పై నోటీసులు.. దర్శకుడు ఏమన్నారంటే..?

‘ఫైటర్‌’(Fighter) సినిమాకు లీగల్‌ నోటీసులు రావడంపై దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ స్పందించారు.

Published : 10 Feb 2024 12:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ సినిమా ‘ఫైటర్‌’(Fighter)లో ముద్దు సీన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి.. చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. యూనిఫాం ధరించి ముద్దు సీన్స్‌ చేయడమంటే.. దాన్ని అవమానించినట్లేనని అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్య దీప్‌దాస్‌ ఆరోపించారు. దీనిపై చిత్ర దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తాజాగా స్పందించారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయ్యాక వాయుసేన అధికారులకు చూపించామన్నారు.

‘ఎయిర్‌ఫోర్స్‌పై నాకు గౌరవముంది. నిబంధనల మేరకే సినిమా తీశాం. స్క్రిప్ట్‌ రాసుకున్నప్పటి నుంచి సెన్సార్‌ రిపోర్ట్‌ వరకు ప్రతి విషయాన్ని వాయుసేన అధికారులతో చర్చించాం. సెన్సార్‌ పూర్తయ్యాక థియేటర్‌లో విడుదలకు ముందు ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది అధికారులకు సినిమాను చూపించాం. వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ ఫిజికల్‌ కాపీ తెచ్చుకున్నాం. అసలు ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరుతో ఐఏఎఫ్‌లో ఏ అధికారి లేరని మా దృష్టికి వచ్చింది. ఇలా ఎవరు చేస్తున్నారో మాకు తెలియడం లేదు’ అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ వైరలవుతున్నాయి.

 గ్లామర్ పాత్రలకు పనికి రానన్నారు: మృణాల్ ఠాకూర్

హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో ‘ఫైటర్‌’ తెరకెక్కింది. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. దీనిపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ‘ఇందులో నా లుక్‌ కోసం కఠోరంగా శ్రమించా. సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నా. ఏడాదిపాటు స్నేహితులను కూడా కలవలేదు. త్వరగా నిద్రపోయేవాడిని. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవాడిని’ అని గతంలో హృతిక్ చెప్పారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.350 కోట్లు పైగా వసూళ్లు చేసినట్లు చిత్రబృందం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని