Sindhooram: ఓటీటీలోకి ‘సిందూరం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి మరో కొత్త సినిమా సిద్ధమైంది. శివ బాలాజీ, ధర్మ నటించిన ‘సిందూరం’ (Sindhooram) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Published : 21 Apr 2023 20:56 IST

హైదరాబాద్‌: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘సిందూరం’ (Sindhooram). శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకుడు. నక్సల్స్‌ ఉద్యమ నేపథ్యంలో మనసును హత్తుకునే ప్రేమకథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా జనవరి నెలలో విడుదలై మంచి టాక్‌ అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. నక్సల్స్‌ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు తెరపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో అలాంటి కథతో వచ్చిన ఓ చిత్రమే ఇది. చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనలను ఇందులో చూపించారు. శ్రీరామగిరి అనే పల్లెటూరు చుట్టూ సాగే కథ ఇది. ఇదే గ్రామానికి చెందిన రవి (ధర్మ) నక్సల్స్‌కు ఇన్‌ఫార్మర్‌ పనిచేస్తుంటాడు. కొన్ని పరిణామాల వల్ల అతడు ఇబ్బందులకు గురి అవుతాడు. మరి, అతడు వాటిని ఎలా అధిగమించాడు? అదే ప్రాంతానికి ఎంఆర్‌వోగా వచ్చిన శిరీష (బ్రిగిడ సాగ) అతడికి ఎంతవరకూ సాయం చేసింది? అనే అంశాలతో ఇది తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని