కన్నడ ‘సీడీ లేడీ’సినిమా!

కర్నాటక రాజకీయాల్లో కలకలం సృష్టించిన ‘సీడీ ఎపిసోడ్‌’ గురించి తెలిసిందే. కర్నాటక మంత్రి రమేష్‌ జర్ఖిహోళి ఈ వివాదంలో ఒక మహిళకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్టు ఆరోపణలు ఎదర్కొంటున్నారు. దీంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి

Published : 23 Mar 2021 16:35 IST

బెంగుళూరు: కర్నాటక రాజకీయాల్లో కలకలం సృష్టించిన ‘సీడీ ఎపిసోడ్‌’ గురించి తెలిసిందే. కర్నాటక మంత్రి రమేశ్‌ జార్ఖిహోళి ఈ వివాదంలో ఒక మహిళకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్టు ఆరోపణలు ఎదర్కొంటున్నారు. దీంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే కథా నేపధ్యం ఇదో కాదో తెలియదు కానీ సినీ నిర్మాత, ప్రతిపక్ష జేడీ-ఎస్‌ నాయకుడు సందేశ్‌నాగరాజ్‌ ‘సీడీ లేడీ’అనే టైటిల్‌ను కన్నడ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో రిజిస్టేషన్‌ చేయించారు. ప్రస్తుతానికైతే ఆ చిత్రం కథగానీ, డైరెక్టర్‌ ఎవరన్నది కానీ నిర్ణయించుకోలేదన్నారు. తాము తీయబోయే చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని మాత్రం వెల్లడించారు. గతంలో ఈయన ‘ఐరావత, ప్రిన్స్‌, మన్నిన ధోని, అమర్‌’ చిత్రాలను నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని