Munawar Faruqui: బిగ్‌బాస్‌ విజేతగా మునావర్‌ ఫారూఖీ

ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ రియాల్టీ షోల్లో అదరగొడుతున్నారు. ఇటీవల ‘లాక్‌ అప్‌’ విజేతగా నిలిచిన ఆయన.. తాజాగా ‘బిగ్‌బాస్‌’ టైటిల్‌ గెలుపొందారు.

Updated : 29 Jan 2024 11:26 IST

ముంబయి: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 17’ ఆదివారంతో ముగిసింది. ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ విజేతగా నిలిచాడు. కారు, రూ.50 లక్షల నగదు అందుకున్నాడు. ఈ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని.. సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులకు మునావర్‌ ధన్యవాదాలు చెప్పాడు. నటుడు అభిషేక్‌ కుమార్‌ రన్నరప్‌గా నిలిచాడు.

Filmfare Awards 2024: ఉత్తమ నటుడు రణ్‌బీర్‌.. ఉత్తమ చిత్రం 12th ఫెయిల్‌

107 రోజులపాటు ఈ సీజన్‌ కొనసాగింది. 21 మంది సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అంకితా లోఖండే, విక్కీజైన్‌ జోడీ అందరి దృష్టిని ఆకర్షించింది. హౌస్‌లో వీరి మధ్య జరిగిన గొడవలు.. చివరకు విడాకులు తీసుకునే వరకూ వెళ్లడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఫైనల్‌లో అడుగుపెట్టిన అంకిత టైటిల్‌ గెలుస్తుందని భావించినప్పటికీ.. అనుకోని విధంగా ఎలిమినేట్‌ అయ్యింది. మునావర్‌ మొదటి నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తూ.. టైటిల్‌ గెలుపొందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని