Sudheer: ఆ సిమ్‌ తీసుకున్నప్పటి నుంచి.. అన్నీ వింతలే: సుడిగాలి సుధీర్‌

‘‘ఆ సిమ్‌ తీసుకున్నప్పటి నుంచి నా జీవితంలో అన్నీ వింత సంఘటనలే చోటుచేసుకుంటున్నాయి’’ అని అంటున్నారు నటుడు సుడిగాలి సుధీర్‌. కమెడియన్‌గా బుల్లితెరపై మంచి సక్సెస్‌ని సొంతం....

Published : 01 Apr 2022 15:36 IST

హైదరాబాద్‌: ‘‘ఆ సిమ్‌ తీసుకున్నప్పటి నుంచి నా జీవితంలో అన్నీ వింత సంఘటనలే చోటుచేసుకుంటున్నాయి’’ అని అంటున్నారు నటుడు సుడిగాలి సుధీర్‌. కమెడియన్‌గా బుల్లితెరపై మంచి సక్సెస్‌ని సొంతం చేసుకున్న ఆయన హీరోగా విజయం సాధించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’, ‘3 మంకీస్‌’తో మిశ్రమ స్పందనలు చవి చూసిన సుధీర్‌ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. అరుణ్‌ వక్కిరాల దర్శకత్వం వహించిన ఈసినిమా టీజర్‌ను శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ‘‘బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి, చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పేలా అవుతుంది’’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఇందులోని ప్రతి సన్నివేశం ఉత్కంఠకు గురి చేసేలా సాగింది. డాలీషా, స్పందన పల్లి, శివబాలాజీ కీలకపాత్రలు పోషించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈసినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని