Jayamma Panchayathi: వాళ్లందరూ తిరిగివ్వకపోతే ఉంటాది: సుమ

‘‘మనం ఎవలెవళ్లకైతే ఈడ్లేశామో వాళ్లందరూ మనకి తిరిగివ్వల్సిందే. లేదంటే సుట్టాల్లేరు. ఊళ్లోవాళ్లు లేరు. ఒక్కొక్కళ్లకి ఉంటాది’’ అని అంటున్నారు వ్యాఖ్యాత...

Updated : 16 Apr 2022 22:20 IST

పవన్‌ చేతుల మీదగా ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘‘మనం ఎవలెవళ్లకైతే ఈడ్లేశామో వాళ్లందరూ మనకి తిరిగివ్వల్సిందే. లేదంటే సుట్టాల్లేరు. ఊళ్లోవాళ్లు లేరు. ఒక్కొక్కళ్లకి ఉంటాది’’ అని అంటున్నారు వ్యాఖ్యాత, నటి సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈసినిమాతో సుమ చాలా రోజుల తర్వాత వెండితెరపై సందడి చేయనున్నారు. వేసవి కానుకగా మే 6న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఈసినిమా ట్రైలర్‌ని పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ విడుదల చేశారు. టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలిపారు. విజయం సాధించాలని కోరుకున్నారు.

గ్రామీణ వాతావరణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో జయమ్మ అనే గడుసైన ఇల్లాలుగా సుమ లుక్‌, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘రా బావా. మా ఊరి పంచాయితీ సూద్దువుగాని. ఏ ఊళ్లో జరగని యేరైటీ గొడవొకటి మా ఊర్లో జరుగుతోంది’’ అనే మాటలతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం మెప్పించేలా సాగింది. ‘‘నా కర్మేంటో ఊళ్లో సమస్యలన్నీ మా ఆయన జబ్బు సుట్టే ఉన్నాయి’’ అంటూ సుమ పండించే హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని