
Suma Kanakala: 23 ఏళ్లుగా మా మధ్య ఎన్నో గొడవలు: సుమ
ఇంటర్నెట్ డెస్క్: తమ వైవాహిక బంధం గురించి ప్రముఖ వ్యాఖ్యాత, నటి సుమ పెదవి విప్పింది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమ వేదికగా ఆమె మాట్లాడింది. తాను ప్రధాన పాత్ర పోషించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం మే 6న విడుదలవుతున్న సందర్భంగా ఈ షోకి ఆమె విచ్చేసింది. కార్యక్రమ వ్యాఖ్యాత ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చింది. విడాకుల విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ‘‘నువ్వూ రాజీవ్ విడిపోయారని, నువ్వొక ఇంట్లో ఉంటే తను మరో ఇంట్లో ఉంటున్నాడని గతేడాది వరకూ వార్తలొచ్చాయి’’ అని ఆలీ వివరిస్తుండగా సుమ స్పందించింది. ‘‘ఇద్దరి మధ్య గొడవలు ఉండటమనేది వాస్తవమే. 23 ఏళ్లలో మా మధ్య ఎన్నో గొడవలు. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం తేలిక. కానీ తల్లిదండ్రులుగా అది చాలా కష్టం’’ అని పేర్కొంది.
ఈ విషయం పక్కన పెడితే, ఈ కార్యక్రమంలో సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఎన్నో నవ్వులు పంచే ఆలీకే పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్వించింది. ‘జయమ్మ పంచాయితీ’లోని ఓ పాటను ఆలపించి, మరో పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. తనకు ఆరుగురు అత్తయ్యలు ఉన్నారని, 13 మంది బావలు ఉన్నారని తెలిపింది. హీరోగా తమ తనయుడి ఎంట్రీ గురించి త్వరలోనే చెప్తానంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mahua Moitra: టీఎంసీకి మహువా గుడ్‌బై..?
-
Movies News
Gautham Raju: గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు: చిరంజీవి
-
India News
Rains: భారీ వర్షాలతో ముంబయికి ఆరెంజ్ అలర్ట్.. హిమాచల్‌లోనూ వరదలు
-
Business News
Cyber Insurance: సైబర్ బీమా.. ఆన్లైన్ లావాదేవీలకు ధీమా
-
Sports News
Ben Stokes : భారత్ 450 పరుగులు చేయాలని కోరుకున్నా: బెన్‌స్టోక్స్
-
Politics News
Eknath Shinde: ఆటో వేగానికి మెర్సిడెస్ వెనుకబడిపోయింది.. ఠాక్రేపై శిందే సెటైర్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Abdul kalam: కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్‌ను నిలువరించిన వేళ..
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు