Surabhi 70MM: ఆసక్తికర మలుపులతో ‘సురభి 70ఎంఎం’

అనిల్‌ కుమార్‌, వినోద్‌ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సురభి 70ఎంఎం’. గంగాధర వైకె అద్వైత దర్శకుడు. బాబీ ఫిలిమ్స్‌, జెఎస్‌ఆర్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకుల

Updated : 14 Feb 2022 09:09 IST

నిల్‌ కుమార్‌, వినోద్‌ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సురభి 70ఎంఎం’. గంగాధర వైకె అద్వైత దర్శకుడు. బాబీ ఫిలిమ్స్‌, జెఎస్‌ఆర్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు గంగాధర మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే మంచి ఎంటర్‌టైనర్‌గా సినిమా చక్కటి వినోదాన్ని పంచిస్తుంది. కథలో ఆసక్తికర మలుపులు ఉన్నాయ’’న్నారు. ఈ సినిమాకి సంగీతం: డెన్నిస్‌ నార్టన్‌, ఛాయాగ్రహణం: శేఖర్‌, గోపాల్‌ ఎస్‌ఎస్‌వి, భరత్‌ సి కుమార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు