Taapsee: అలాంటి వ్యక్తి మాత్రమే భద్రత కల్పించగలడు: తాప్సీ

తన పెళ్లి గురించి వస్తోన్న రూమర్స్‌పై నటి తాప్సీ మరోసారి స్పందించారు.

Published : 13 Mar 2024 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన తాప్సీ (Taapsee Pannu) అక్కడ బిజీగా మారారు. సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఆమె పెళ్లిపై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నట్లు ప్రచారం జోరందుకుంది. తాజాగా దీనిపై ఆమె మరోసారి స్పందించారు. తన ప్రియుడు మథియాస్‌ బోతోను ఉద్దేశించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మథియాస్‌ బోతో కంటే ముందు నేను కొందరితో సన్నిహితంగా ఉండాల్సి వచ్చింది. మగవారంతా గొప్ప వ్యక్తిత్వం ఉన్న పురుషులు కాలేరు. పరిణితి చెందిన వ్యక్తి మాత్రమే నాకు భద్రత కలిగించగలడని నిశ్చయించుకున్నాను. భావోద్వేగాల విషయంలో ఎక్కడా రాజీపడలేను. ప్రత్యేకించి నా వ్యక్తిగత, వృత్తి జీవితంలో జరిగే మార్పులను పరిగణనలోకి తీసుకున్నాను. అందుకే మంచి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు.

కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?

ఇక తన పెళ్లిపై వస్తోన్న వార్తల గురించి మాట్లాడుతూ.. ‘వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ నేను దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తాను. అది పూర్తిగా నా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరో ఒత్తిడి చేస్తున్నారనో.. రకరకాల వార్తలు వస్తున్నాయనో ఏ విషయాన్ని బహిర్గతం చేయను. పెళ్లి అనేది అందరి జీవితాల్లో ముఖ్యమైన భాగం. దాని గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. నా రిలేషన్‌కు సంబంధించిన విషయాలను కూడా నేనేం దాచలేదు. సరైన సమయం వచ్చినప్పుడు అన్నిటి గురించి తెలుస్తుంది’ అని తనశైలిలో సమాధానమిచ్చారు. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారి రిలేషన్‌ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటినుంచి పెళ్లి వార్తలు నెట్టింట ప్రచారమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని