Veeran ott date: ఓటీటీలో ‘వీరన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమిళ ఆది కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వీరన్‌’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

Published : 24 Jun 2023 15:37 IST

హైదరాబాద్‌: సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమిళ ఆది కీలక పాత్రలో నటించిన చిత్రం ‘వీరన్‌’ (Veeran). జూన్‌ 2న తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జూన్‌ 30వ తేదీ నుంచి ‘వీరన్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్‌లో కేవలం తమిళ్‌లోనే విడుదల కాగా, ఓటీటీలో తమిళ్‌తో పాటు, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో రానుంది.

ఇక కథ విషయానికొస్తే, కుమరన్‌ అనే 15 ఏళ్ల బాలుడు కోయంబత్తూరులోని వీరనార్‌ అనే గ్రామంలో నివశిస్తుంటాడు. ఒకరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు మెరుపుదాడికి గురై స్పృహ కోల్పోతాడు. ఆ షాక్‌ నుంచి బయటపడిన తర్వాత తనకు కొన్ని శక్తులు వచ్చినట్లు గ్రహిస్తాడు. మరి ఆ శక్తులతో కుమరన్‌ ఏం చేశాడు? వాటిని ఏయే పనులకు వినియోగించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఏఆర్‌కే శరవణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినయ్‌ రాయ్‌, అతిరారాజ్‌, మున్షికాంత్‌, కాలా వెంకట్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని