The Great Indian Suicide: వెన్నులో వణుకుపుట్టించే థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

The Great Indian Suicide: మ‌ద‌న‌ప‌ల్లె పట్టణంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్’  తెర‌కెక్కింది.

Published : 26 Sep 2023 15:47 IST

హైదరాబాద్‌: రామ్‌ కార్తిక్‌, హెబ్బాపటేల్‌ కీలక పాత్రల్లో విప్లవ్‌ కోనేటి దర్శకత్వం వహించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ (The Great Indian Suicide). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 6వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ట్వీట్‌ చేసింది. ప్రచార చిత్రం చూస్తుంటే, ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.

ఇక చిత్ర కథ అనూహ్య‌ రీతిలో సాగుతుందని అర్థమవుతోంది. ఇంతకీ ఈ సినిమా నేపథ్యం ఏంటంటే.. ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవాలనుకుంటుంది. అస‌లు వాళ్ల ఉద్దేశం ఏంటి?మళ్లీ పుట్ట‌డ‌మేనా?ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనూహ్య‌మైన ట్విస్టులు, స‌స్పెన్స్, డ్రామా, రొమాన్స్‌ తదితర అంశాలను మేళవించి తాజా చిత్రాన్ని తీర్చిదిద్దారు. మ‌ద‌న‌ప‌ల్లె పట్టణంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్’  తెర‌కెక్కింది. నటులు న‌రేష్ వీకే, ప‌విత్రా లోకేష్‌ ఈ సినిమాలో భార్య భర్తలుగా కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని