Keerthy Suresh: కీర్తి సురేశ్ ‘గుడ్ లక్ సఖి’ విడుదలకి సిద్ధం.. ఎప్పుడంటే?
‘మహానటి’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ తర్వాత కీర్తి సురేశ్ నటించిన మరో నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రైఫిల్ షూటర్‌గా నటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘మహానటి’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ తర్వాత కీర్తి సురేశ్ నటించిన మరో నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి రైఫిల్ షూటర్‌గా నటించింది. నాగేశ్ కుకునూర్ దర్శకుడు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడటంతో త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించనుంది. నవంబరు 26న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆది, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi: రూ.1400కోట్ల వ్యయంతో.. దిల్లీలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ!
-
Movies News
Bellamkonda Ganesh: అప్పుడు రిలీజ్ డేట్ సరిగ్గా ప్లాన్ చేయలేదనే టాక్ వినిపించింది: బెల్లంకొండ గణేశ్
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
Movies News
The Night Manager: ‘ది నైట్ మేనేజర్’.. పార్ట్ 2 వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Director Teja: నమ్మిన వాళ్లే నన్ను అవమానించారు: తేజ