Oo Antava Mava: ‘ఊ అంటావా ఊఊ అంటావా’ వివాదం.. స్పందించిన రచయిత

‘‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’’ ‘పుష్ప’ చిత్రంలోని ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. విడుదలైనప్పటి నుంచి మిలియన్లలో వ్యూస్‌ సొంతం చేసుకొని యూట్యూబ్...

Published : 23 Dec 2021 14:17 IST

చెన్నై: ‘‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’’ ‘పుష్ప’ చిత్రంలోని ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. విడుదలైనప్పటి నుంచి మిలియన్లలో వ్యూస్‌ సొంతం చేసుకొని యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ పాటకు ప్రేక్షకాదరణ మెండుగా ఉన్నప్పటికీ పలువురు నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. పురుషుల స్వభావాన్ని కించపరిచేలా దీనిలో లిరిక్స్ ఉన్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఊ అంటావా’ పాట వివాదంపై తమిళ వెర్షన్‌ రచయిత వివేక్‌ స్పందించారు. ‘‘పాటపై కొంతమంది పురుషులు మాత్రమే అభ్యంతరం తెలిపారు. ఎక్కువశాతం మంది థియేటర్‌లో ఆ పాటను ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని అన్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ సైతం ఇటీవల ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో ఈ వివాదంపై స్పందించిన విషయం తెలిసిందే. ‘‘ప్రస్తుతం మనం సమాజంలో ఏదైతే చూస్తున్నామో అదే పాటలా రచించారు. అందులో ఉన్న లిరిక్స్‌ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి’’ అని తెలిపారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి సమంత ఈ పాటకు స్టెప్పులేశారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని