Mammootty: బార్బర్‌ కొడుకు ముఖ్యమంత్రి అయితే?

రాజకీయ నేపథ్యంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన మలయాళీ చిత్రం ‘వన్‌’. సంతోష్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మలయాళీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

Updated : 22 Jul 2023 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజకీయ నేపథ్యంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన మలయాళీ చిత్రం ‘వన్‌’. సంతోష్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మలయాళీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగు వారిని అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో జులై 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం పాత్రలో కనిపించారు మమ్ముట్టి. సీఎంగా ఆయన నటన, గెటప్‌ ఆకట్టుకుంటున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య సాగే సంభాషణలు మెప్పిస్తున్నాయి. ‘ఒక బార్బర్‌ కొడుకు ముఖ్యమంత్రి అయితే.. ఇదుగో ఇలాగే ఉంటుంది’, ‘మనలాంటి వాళ్లని తిట్టినా.. పడేసి కొట్టినా ఎవరూ పట్టించుకోరు’ తదితర డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి కల్లూరి చంద్రం ముఖ్యమంత్రిగా ఎలా మారారు? ఆయన ప్రస్థానం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మురళీ గోపీ, జార్జ్‌, గాయత్రి అరుణ్‌, ఇషానీ కృష్ణ తదితరులు నటించిన ఈ సినిమాకి బాబీ, సంజయ్‌ కథ అందించారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని