Sridevi Drama Company: ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే!
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లేటెస్ట్ ప్రోమో.. వృద్ధుల మనోగతాలతో ప్రత్యేక ఎపిసోడ్.
ఇంటర్నెట్ డెస్క్: కడుపున పుట్టిన వారే ‘మీరు నాకు భారం’ అని అంటే ఆ తల్లిదండ్రులు తట్టుకోగలరా? ఇదుగో నీ కోసం దుప్పట్లు తీసుకొస్తా, పండ్లు కొనుకొస్తా అని చెప్పి వృద్ధాశ్రమం దగ్గర వదిలేస్తే వారి గుండెలు పగలకుండా ఉండగలవా? ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా, ఎన్ని చూసినా అంతే! ఇలా చేసే వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (ఈటీవీ) కార్యక్రమం ప్రత్యేక ఎపిసోడ్‌ని రూపొందించింది. వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి అంకితమిచ్చింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదలై, హృదయాన్ని బరువెక్కిస్తోంది.
వారంతా ఓ వృద్ధాశ్రమంలో కాలం గడిపేవారు. కడుపున పుట్టిన వారే కాదన్నారనే బాధలో ఉండే వారి మోముల్లో చిరు నవ్వులు విరబూయించే ప్రయత్నం ఇది. ఓ బామ్మతో కలిసి ఆది చేసిన కామెడీ అందరిలోనూ ఆనందం నింపింది. అనంతరం ఆ పెద్దావిడే ‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి’ అంటూ ఆలపించి, హృదయాన్ని హత్తుకుంది. తన బిడ్డల్ని తలచుకుని కంటతడి పెట్టుకోవడంతో అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఓ అమ్మ విషయంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సుధీర్. ‘ఇక్కడున్న తల్లిదండ్రులు వెక్కివెక్కి ఏడవాల్సిన అవసరం ఏముంది? చక్కగా మీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా’ అని తల్లిదండ్రుల్ని వదిలేసిన వారిని కోరాడు. ఇదే వేదికపై భాను, వర్ష ఈ వృద్దాశ్రమానికి రూ. 1,00,000 సాయం అందించారు. వారి మందులకయ్యే ఖర్చుల వివరాల్ని తెలుసుకుని, ఆ మొత్తాన్ని ప్రతినెలా నేనిస్తానని ఇంద్రజ తెలిపారు. పూర్తి ఎపిసోడ్ అక్టోబరు 3న ప్రసారంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్‌లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్‌లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్‌కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్‌కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్‌రేట్‌పై కామెంట్లకు విరాట్ కౌంటర్