Thandatti: ఓటీటీలో ‘తందట్టి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పశుపతి రామస్వామి, రోహిణి, వివేక్‌ ప్రసన్న కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తందట్టి’. రామ్‌ సంగయ్య దర్శకుడు.

Published : 11 Jul 2023 20:54 IST

హైదరాబాద్‌: పశుపతి రామస్వామి, రోహిణి, వివేక్‌ ప్రసన్న కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తందట్టి’. రామ్‌ సంగయ్య దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ విభిన్న కథా చిత్రంగా మంచిటాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ‘తందట్టి’ జులై 14న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

కథేంటంటే.. పోలీస్‌ కానిస్టేబుల్‌ అయిన వీర సుబ్రమణియన్‌ (పశుపతి) పది రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెల్వరాజ్‌ బామ్మ (రోహిణి) కనిపించకుండా పోతుంది. ఈ కేసు పరిష్కరించే పనిని సీనియర్‌ అధికారి సుబ్రమణియన్‌కు అప్పగిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కేసు పరిష్కారం అయిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని