The Ghost: 33 ఏళ్ల కిత్రం సైకిల్ చైన్.. ఇప్పుడు కత్తి.. వచ్చేస్తున్నా: నాగార్జున
సుమారు 33 ఏళ్ల క్రితం తాను హీరోగా నటించిన ‘శివ’ (Shiva) విడుదలైన రోజే ఈ ఏడాది ‘ది ఘోస్ట్’ చిత్రం విడుదలవుతుండటం విశేషమని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.
కర్నూలు: సుమారు 33 ఏళ్ల క్రితం తాను హీరోగా నటించిన ‘శివ’ (Shiva) విడుదలైన రోజే ఈ ఏడాది ‘ది ఘోస్ట్’ (The Ghost) చిత్రం విడుదలవుతుండటం విశేషమని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) అన్నారు. అప్పుడు అక్టోబరు 5న సైకిల్ చైన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చానని, ఇప్పుడు కత్తితో రాబోతున్నానని తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్.టి.బి.సి కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. తన తనయులు, నటులు నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil) అతిథులుగా హాజరయ్యారు.
చిత్ర పరిశ్రమ, నాన్నకు థ్యాంక్స్: నాగార్జున
‘‘మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు సినీ పరిశ్రమ, మా నాన్న (అక్కినేని నాగేశ్వరరావు)గారికి థ్యాంక్స్ చెప్పాలి. సుమారు 33ఏళ్ల క్రితం అక్టోబరు 5న ‘శివ’ అనే సినిమా వచ్చింది. సైకిల్ చైన్‌తో అప్పుడు మీ ముందుకొచ్చా. ఇప్పుడు కత్తితో ‘ది ఘోస్ట్’ చిత్రంతో అదే రోజు వస్తున్నా. రెండూ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. విజయ దశమి అందరికీ విజయం అందిస్తుందంటారు. మా సినిమా విజయం సాధిస్తుందని అనుకుంటున్నా. ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్‌కు యాక్షన్, డ్రామా కథలంటే అంటే బాగా ఇష్టం. ఆ రెండూ కలిపి తీసిన చిత్రమే ‘ది ఘోస్ట్’. ‘శివ’ విషయంలో సౌండ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ది ఘోస్ట్’ విషయంలో విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఓ రేంజ్లో ఉంటాయి. మీ ప్రేమ, కేరింతలు, ఉత్సాహాన్ని దగ్గర్నుంచి చూస్తారనే చైతూ, అఖిల్‌ని ఇక్కడికి తీసుకొచ్చా. మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని నమ్ముతున్నా. అదే రోజున విడుదకాబోతున్న నా ఆప్తుడు చిరంజీవి గారి సినిమా (గాడ్ ఫాదర్) కూడా విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని నాగార్జున అన్నారు.
ఎప్పుడూ ‘ది ఘోస్ట్’ గురించే: నాగచైతన్య
‘‘నాన్నను నేను వారంలో రెండుమూడు రోజులు కలుస్తుంటా. తాను నటించే సినిమాలు, బిగ్‌బాస్ కార్యక్రమం గురించి చర్చిస్తుండేవారు. కానీ, కొన్నాళ్ల నుంచి ఆయన ఒకే ఒక టాపిక్ గురించి మాట్లాడారు. అదే ‘ది ఘోస్ట్’ సినిమా. ఆయన్ను అంత ఉత్సాహంగా చూసి చాలా కాలమైంది. ‘బంగార్రాజు’ నుంచి ‘ది ఘోస్ట్’ పాత్రకు తగ్గట్టు మారటం అంత తేలిక కాదు. ఆ విషయంలో నాన్న మాకెంతో స్ఫూర్తి. నేను చూడాలనుకున్న విధంగా నాన్నను ‘ది ఘోస్ట్’లో స్టైలిష్‌గా చూపించినందుకు దర్శకుడు ప్రవీణ్‌కు ధన్యవాదాలు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’’ అని నాగచైతన్య మాట్లాడారు.
మా ధైర్యం నాన్నే: అఖిల్
‘‘నాన్నను ఎలా చూడాలనుకుంటున్నానో ఈ సినిమాలో అలా చూశా. నేనూ చైతన్య కాలర్ ఎగరేస్తున్నాం. ఈ విషయంలో దర్శకుడు ప్రణీణ్కు థ్యాంక్స్. ‘ఈయనకు సినిమాపై ప్యాషన్ తగ్గదా? ఆకలి తగ్గదా?’ అని నాన్న గురించి నేనూ చైతన్య మాట్లాడుకున్నాం. 30 ఏళ్లుగా ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తున్నారాయన. మా ధైర్యం, స్ఫూర్తి.. ఇంట్లోనే ఉందని మాకు ఇప్పుడు అర్థమైంది. మేం ఎంతగా పరిగెత్తాలో మీరే చూపిస్తున్నందుకు థ్యాంక్స్ నాన్న. ‘ది ఘోస్ట్’ సినిమా ప్రారంభం నుంచీ ఫైర్‌తోనే ముందుకెళ్తోంది. చిత్ర బృందం కష్టమంతా ప్రచార చిత్రాల్లో కనిపిస్తోంది’’ అని అఖిల్ పేర్కొన్నారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విషయంలో ముందుగా మా నిర్మాతలు సునీల్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్, ఈ వేడుకకు విచ్చేసిన అఖిల్, నాగచైతన్యలకు ధన్యవాదాలు. నాగార్జున సర్‌ను డైరెక్ట్ చేయటం మరిచిపోలేని అనుభూతి. మీ (అభిమానులు) అంచనాలకు తగ్గట్టు ‘ది ఘోస్ట్’ని తెరకెక్కించాననే నమ్మకం ఉంది. ఓ అభిమానిగా ఆయన్ను ఎలాంటి పాత్రల్లో చూస్తూ పెరిగానో ఈ సినిమాలో అలాగే చూపించా’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత