Social Look: చీరలో మెరిసిన నేహాశెట్టి.. ఎన్టీఆర్‌తో హిమజ ఫొటో..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 15 Sep 2023 02:19 IST
  • నటి నేహాశెట్టి చీరలో మెరిశారు. క్రీమ్‌ కలర్‌ చీర ధరించి తాజాగా ఓ ఫొటోషూట్‌లో ఆమె పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆమె స్టైలిష్‌ లుక్స్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
  • సైమా వేడుకల్లో పాల్గొనేందుకు టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు దుబాయ్‌కు పయనమయ్యారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఎన్టీఆర్‌ దుబాయ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్లైట్‌లో ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోని నటి హిమజ నెట్టింట షేర్‌ చేశారు. ‘‘చూడగానే అన్నా అని పిలిచేశా’’ అంటూ తన అభిమానాన్ని తెలియజేశారు.
  • నటుడు విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌కు ఇటీవల ఓ మైనర్‌ సర్జరీ జరిగింది. ఈనేపథ్యంలో విజయ్ తన తండ్రిని కలిశారు. వెకేషన్‌ నుంచి చెన్నైకు తిరిగి వచ్చిన విజయ్‌.. తల్లిదండ్రులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని