Top Gear: ఓటీటీలో సందడి చేస్తోన్న ఆది ‘టాప్‌గేర్‌’.. ఎక్కడంటే?

ఆది సాయికుమార్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా.. ‘టాప్‌గేర్‌’. ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సందడి చేస్తోంది. 

Published : 21 May 2023 22:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆది సాయికుమార్‌ (Aadi Saikumar) హీరోగా దర్శకుడు కె. శశికాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘టాప్‌గేర్‌’ (Top Gear). రియా సుమన్‌ కథానాయిక. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబరు 30న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఓటీటీ (ott) ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియా’ (amazon prime video) వేదికగా సందడి చేస్తోంది. ఎలాంటి ప్రచారం లేకుండా స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. ఊహించిన విధంగా డ్రగ్స్‌ మాఫియాలో ఇరుక్కున్న క్యాబ్‌ డ్రైవర్‌ దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? ఆ క్రమంలో తనకెదురైన సమస్యలేంటి? తదితర ఆసక్తికర అంశాలతో ‘టాప్‌గేర్‌’ని తెరకెక్కించారు. ఇదే ఓటీటీలో.. ఆది నటించిన మరో సినిమా ‘సి.ఎస్‌.ఐ. సనాతన్‌’ (CSI Sanatan) ఇటీవల విడుదలైంది. ఈ సినిమాని దర్శకుడు శివశంకర్‌ దేవ్‌ తెరకెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని