Trisha: ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌పై దర్శకుడి ట్వీట్‌.. 10 ఏళ్లకు రిప్లై ఇచ్చిన త్రిష..

నటి త్రిష (Trisha) చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో సందడి చేస్తోంది. ఓ దర్శకుడికి రిప్లై ఇచ్చిన ఆమె హిట్ సినిమా సీక్వెల్‌ల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

Published : 11 Sep 2023 12:45 IST

హైదరాబాద్‌: ఇప్పటికీ వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు నటి త్రిష (Trisha). ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా ఓ దర్శకుడి ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ రిప్లై ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లంతా షాక్‌ అయ్యారు. ఎందుకంటే ఆయన పెట్టిన 10 ఏళ్లకు త్రిష రిప్లై ఇవ్వడం గమనార్హం.

2007లో తమిళ దర్శకుడు  సెల్వరాఘవన్‌ (Selvaraghavan) తెరకెక్కించిన సినిమా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’(Aadavari Maatalaku Arthake Verule). వెంకటేశ్‌, త్రిష జంటగా నటించిన ఈ కుటుంబకథా చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాపై 2013లో సెల్వరాఘవన్ ఓ ట్వీట్‌ చేశారు. ‘చాలా రోజుల తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’ చూశాను. వెంకటేశ్‌, త్రిషలతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతినిచ్చింది. దీని సీక్వెల్‌ తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ వాళ్లిద్దరినీ ట్యాగ్‌ చేశారు. ఆ ట్వీట్‌కు త్రిష ఇప్పుడు రిప్లై ఇచ్చారు. ‘నేను కూడా సీక్వెల్‌ల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని స్పందించారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఇంత త్వరగా రిప్లై ఇచ్చారా?’ అని ఒకరు అనగా ‘ఇంత మంచి సినిమా సీక్వెల్ తీయడం మంచి విషయం’ అని మరొకరు తన అభిప్రాయాన్ని తెలిపారు. ఏదేమైనా త్రిష ట్వీట్‌తో సోషల్‌మీడియాలో సందడి వాతావరణం నెలకొంది. 

మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది.. మోదీపై ప్రశంసలు కురిపించిన షారుక్‌..

ఇక ‘పొన్నియిన్ సెల్వన్‌2’లో తన నటనతో ఆకట్టుకున్న త్రిష.. త్వరలోనే విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లియో’లో కనిపించనుంది. ప్రస్తుతం దీని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని