Upasana: నాకు, రామ్‌ చరణ్‌కు ఈ సిటీ స్పెషల్.. కానీ: ఉపాసన

తమకు చెన్నై నగరం ప్రత్యేకమని ఉపాసన తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.

Published : 06 Feb 2024 00:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తనకు, రామ్‌ చరణ్‌ (Ram Charan)కు చెన్నై నగరం ప్రత్యేకమని ఉపాసన (Upasana) తెలిపారు. అపోలో గ్రూప్స్‌ అధినేత, తన తాత ప్రతాప్‌ సి.రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ‘ది అపోలో స్టోరీ’ (The Apollo Story) కామిక్‌ బుక్‌ని ఆవిష్కరించారు. దాన్ని ఆయనకు అంకితమిస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విశేషాలు పంచుకున్నారు.

‘‘నేను ఈ నగరంలోనే పుట్టా. ఈ సిటీ నాకెంతో ఇష్టం. కానీ, నా మనసు ఎప్పుడూ హైదరాబాద్‌తోనే ఉంటుంది. రామ్‌ చరణ్‌ కూడా ఇక్కడే పుట్టారు. ఆయనకూ చెన్నై అంటే ప్రేమ. మా ఇద్దరికీ ఇది స్పెషల్‌. అటు కామినేని, ఇటు కొణిదెల కుటుంబాలపై తమిళనాడు రాష్ట్ర ప్రజలు అభిమానం చూపిస్తారు. వారందరికీ థ్యాంక్స్‌’’ 

‘‘మా తాత నాకు స్ఫూర్తి. అన్ని విషయాల్లో నన్ను సపోర్ట్‌ చేస్తారు. నా ప్రయాణంలో ఒకవేళ నేను దారి తప్పినట్లు అనిపిస్తే సలహా ఇస్తారు. అమ్మమ్మ కూడా నా బలం. రామ్‌ చరణ్‌, రానా బాల్యం నుంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ‘ది అపోలో స్టోరీ’ బుక్‌ గురించి చెప్పగానే రానా ముందుకొచ్చారు. మహిళా సాధికారిత గురించి అందులో ప్రస్తావించాం. నా కెరీర్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తానో, తల్లిగా నా బిడ్డకు అంతే ప్రాధాన్యత ఇస్తా’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని