Telugu Movies:ఈ వారం థియేటర్‌లో మూడే చిత్రాలు.. మరి ఓటీటీలో..?

Telugu Movies: గత రెండు, మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలు థియేటర్‌లను పలకరిస్తున్నాయి. జులై చివరి వారంలో పవన్‌కల్యాణ్‌ మూవీ తెలుగులో విడుదలవుతుండటంతో ఒకే ఒక చిన్న సినిమా మినహా మరే ఏ చిత్రామూ రావడం లేదు.

Updated : 24 Jul 2023 16:11 IST

పవన్‌కల్యాణ్‌ సరికొత్త అవతారం

గ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’ (Bro Movie) సముద్రఖని దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ మూవీని రీమేక్‌ చేశారు. స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘బ్రో’ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో పవన్‌ ఇందులో నటించారు. కాలం అవతారంలో ఆయన కనిపించనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో  కేతికశర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, సముద్రఖని, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


శునకాన్ని పెళ్లి చేసుకుంటే..

టుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ (slum dog husband). ప్రణవి మానుకొండ కథానాయిక. బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు. ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకుడు. మైక్‌ మూవీస్‌ నిర్మిస్తోంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. జాతకంలో దోషం ఉన్న ఓ యువకుడు కుక్కను పెళ్లి చేసుకోవడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ పెళ్లి వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు? తెలియాలంటే ‘స్లమ్ డాగ్ హస్బండ్’ చూడాలి. ఇందులో రాకీ అనే కుక్క ముఖ్య పాత్రలో నటించింది. దీనికి ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ అందించారు.


రాఖీ... రాణీ.. ఓ అందమైన ప్రేమ కహానీ

బాలీవుడ్‌ కథానాయకుడు రణవీర్‌ సింగ్‌ (Ranveer Singh), అలియా భట్‌ (Alia Bhatt) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani). కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాకీ, రాణీల మధ్య ప్రేమకథను ఈ సినిమాలో చూపించున్నారు. ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  జులై 28న ఈ సినిమా విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • డ్రీమ్‌ (కొరియన్‌ మూవీ) జులై 25
  • మామన్నన్‌ (తమిళ్‌/తెలుగు) జులై 27

  • పారడైజ్‌ (హాలీవుడ్) జులై 27
  • హిడెన్‌ స్ట్రైక్‌ (హాలీవుడ్) జులై 27
  • హ్యాపీనెస్‌ ఫర్‌ బిగినెర్స్‌ (హాలీవుడ్‌) జులై 27
  • హౌ టు బికమ్‌ ఎ కల్ట్‌ లీడర్‌ జులై 28
  • డిస్నీ +హాట్‌స్టార్‌
  • ఆషిఖానా (హిందీ సిరీస్‌) జులై 24
  • సోనీలివ్‌
  • ట్విస్టెడ్‌ మెటల్‌ (వెబ్‌సిరీస్‌) జులై 28
  • బుక్‌ మై షో
  • జస్టిస్‌ లీగ్‌: వార్‌ వరల్డ్‌ (యానిమేషన్‌ మూవీ) జులై 23
  • ట్రాన్స్‌ఫార్మర్స్‌:రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 26
  • ద ఫ్లాష్‌ (హాలీవుడ్‌) జులై 27
  • జియో సినిమా
  • లయనెస్‌ (హాలీవుడ్‌) జులై 23

  • కాల్‌కూట్‌ (హిందీ) జులై 27
  • మనోరమా మ్యాక్స్‌
  • కొళ్ల (మలయాళం) జులై 27
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని