Lambasingi: ఆకట్టుకుంటోన్న ‘లంబసింగి’ రెండో పాట

భరత్‌రాజ్‌- దివి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లంబసింగి’. 

Published : 08 Mar 2024 15:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భరత్‌రాజ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). ఎ ప్యూర్‌ లవ్‌స్టోరీ... అనేది ఉప శీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా నటిస్తున్నారు. ఆనంద్‌.టి నిర్మిస్తున్నారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల సమర్పకులు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇందులోని ‘వయ్యారి గోదారి నువ్వే... నా దారికొచ్చి చేరావులే...’ అంటూ సాగే పాటని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం సమకూర్చగా, జావేద్‌ అలీ ఆలపించారు. ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌ స్వరకర్త. ఈ మెలోడీ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని