F3 FUNtastic Event: ఈసారి అభిమానులను నిరాశ పరచను: వెంకటేశ్
పరిస్థితుల కారణంగా తాను నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందని, కానీ, ఈసారి అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచనని అన్నారు అగ్ర కథానాయకుడు
హైదరాబాద్: పరిస్థితుల కారణంగా తాను నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందని, కానీ, ఈసారి అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచనని అన్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్(Venkatesh). వరుణ్ తేజ్‌తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎఫ్3’. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఎఫ్3 ఫన్టాస్టిక్’ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల క్రితం నా సినిమా థియేటర్లో విడుదలైంది. పరిస్థితుల కారణంగా, ‘నారప్ప’, ‘దృశ్యం’ ఓటీటీల్లో విడుదలయ్యాయి. థియేటర్లో నా సినిమా చూడాలని ఎదురు చూసిన అభిమానులు నిరాశపడ్డారు. వారందరికీ ‘ఎఫ్3’ మంచి ట్రీట్. నన్ను అభిమానించే ఫ్యామిలీ అభిమానులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అనిల్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో సినిమా చేశారు. ఇలాంటి సినిమాలను గతంలోనూ ఆదరించారు. అలాగే ‘ఎఫ్3’ని కూడా చూస్తారని ఆశిస్తున్నా. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన నటీనటులు, సాంకేతిక బృందానికి అభినందనలు. మే 27న ‘ఎఫ్3’ని థియేటర్లో చూసి ఆనందించండి’’ అని అన్నారు.
‘‘ఎఫ్3’ మొదలు పెట్టిన తర్వాత రెండు వేసవి కాలాలు పూర్తయ్యాయి. మరోవైపు పూర్తి స్థాయి కామెడీ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. వెంకటేశ్‌గారు చాలా మందితో మల్టీస్టారర్ చేశారు. కానీ, రెండోసారి చేసే అవకాశం నాకు మాత్రమే దక్కింది. వెంకటేశ్, అనిల్ రావిపూడి వల్ల నాకు ‘ఎఫ్3’ మరో ప్లస్ అవుతుంది’’ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.
‘ఎఫ్2’నే మాకు పెద్ద శత్రువు: అనిల్
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘2020 తర్వాత రెండేళ్లు అందరికీ విరామం. చాలా సుదీర్ఘ ప్రయాణం. మిమ్మల్ని నవ్వించటం కోసం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మా ముందు ‘ఎఫ్2’ అనే పెద్ద శత్రువు ఉంది. దానికి మించేలా ఈ సినిమా ఉండాలనుకున్నాం. నవ్వడం చాలా సులభం.. కానీ, కామెడీని క్రియేట్ చాలా కష్టం. నా కోసం, సినిమా కోసం నా టీమ్ చాలా ఇబ్బందులు పడింది. నన్ను భరించింది. ఈ సినిమాలో 35మందికి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ చాలా కష్టపడి పనిచేశారు. ‘ఈ సినిమాను కామెడీ ఫిల్మ్ అనకండి’ అని దేవిశ్రీ అన్నారు. దానికి కనెక్ట్ అయి, మంచి సంగీతం అందించారు. వరుణ్ నాకొక బ్రదర్‌లాంటివారు. ‘ఎఫ్2’లో కనిపించిన వరుణ్, ‘ఎఫ్3’ కనిపించే వరుణ్ వేరు. చాలా చక్కగా కామెడీ పంచారు. వెంకటేశ్‌గారు నా ఆల్‌టైమ్ ఫేవరెట్. స్టార్ హీరో అయినా, కామెడీ చేసేటప్పుడు ఆ ఇమేజ్ను పక్కన పెట్టి చేస్తారు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి. లవ్వ్యూ వెంకటేశ్‌గారు.. ‘నవ్వటం ఒక యోగం.. నవ్వలేకపోవటం రోగం.. నవ్వించటం ఒక భోగం’ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ చేసిన పని ఇదే’’ అని అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ అనిల్ రావిపూడి మిమ్మల్ని నవ్విస్తారు. నిర్మాతల కుమారుడు వెంకటేశ్, వరుణ్ మామూలుగా నవ్వించరు. ఎఫ్2లో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఇందులో నలుగురు ఉన్నారు. సాంకేతిక బృందం కూడా చాలా కష్టపడి పనిచేసింది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు. కార్యక్రమంలో సునీల్, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్